home

Thursday, December 14, 2017

BAMBOO TREE (బ్యాంబు ట్రీ-చైనా వెదురు చెట్టు)



బ్యాంబు ట్రీ:-(చైనా వెదురు చెట్టు);-

               ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది.ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది.(చెట్టు పెరిగినట్టు వ్యాపారం పెరుగుతుంది.వ్యాపార సంస్థలలో నరథిష్టికి ' ఆకర్షణకు ,వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .

           
పిల్లలు చధువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద ,సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి) .మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు.

         
ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు ,నరదృష్టి ,కనుదృష్టి,చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు ,థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .
           
ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ మొక్కలు రకరకాల ఆకృతులలో రూపొందించిన కుండీలలో లభ్యమవుతున్నాయి. దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు.
                             
వీటిని గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ఇండరో మొక్కలను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడో తాజా ట్రెండ్ మొదలైంది. వెదురు మొక్కలనులక్కి ప్లాంట్స్‌గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ధన బలంపెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ సంస్కృతి అలా అలా వ్యాపించటంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి.

No comments:

Post a Comment