home

Thursday, December 21, 2017

ఓంకార ధ్వని గంట (OM BELL)

ఓంకార ధ్వని గంట
(OM BELL)
www.astnumber.blogspot.in

ఓంకార ధ్వని గంట
                
ఓంకార ధ్వని గంట పూర్తిగా కంచుతో చేయబడి ఉంటుంది. ఓంకార ధ్వని గంట మూడు విభాగాలుగా ఉంటుంది.గంట ఉన్న భాగం పూర్తిగా కంచు తో చేయబడి ఉంటుంది.గంట పైభాగాన ఇత్తడితో చేయబడి ఉంటుంది.గంట అంచు అడుగు భాగాన్ని చేతితో తిప్పటానికి చిన్న కర్ర ఉంటాయి.

ఉపయోగించే విధానం:-
                 
ఓంకార ధ్వని గంటని ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత సూర్యోదయ సూర్యాస్తమయాలలోను ఉపయోగిస్తారు.గంట పైభాగాన్ని చేతితో పట్టుకొని కింద అంచు భాగాన్ని చిన్న కర్రతో తిప్పాలి.గంటని తిప్పేటప్పుడు పైన చేతితో పట్టుకుంటానికి వీలున్న ఇత్తడితో చేసిన భాగాన్ని మాత్రమే చేతితో పట్టుకోవాలి.గంటకు ఉన్న కంచుభాగానికి చేయి తగలకూడదు.అట్లు తగిలినచో ద్వని సరిగా వినిపించదు.గంట అడుగు అంచు భాగాన్ని కర్రతో తిప్పేటప్పుడు గంట పైభాగాన్ని గట్టిగా పట్టుకొనీ కింద అంచు భాగాన్ని కర్రతో పూర్తిగా వృత్తాకారంగా చిన్న చిన్నగా వేగం పెంచుతూ తిప్పుతూ పోవాలి. ఈ విధంగా తిప్పుతూ పోయిన కొద్ది ధ్వనిలో శభ్ద తీవ్రత ఎక్కువై "ఓంకారం" స్పష్టంగా వినపడుతుంది.
ఉపయోగాలు:- 
             
ఓంకార ధ్వని గంటని ప్రతిరోజు ఉపయోగించవచ్చును.
"
ఓంకార శభ్దం" రోజు వినడం వలన మనలో ఆధ్యాత్మికత చేకూరుతుంది.
"
ఓంకార శభ్దం" మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
"
ఓంకార శభ్దం" మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తొలిగించి పాజిటివ్ ఆలోచనల్ని కలిగిస్తాయి.
"
ఓంకార శభ్దం" మనకు కలిగిన సమస్యాపరిష్కారానికి తగిన మార్గనిర్ధేశాన్ని కలిగిస్తుంది.
"
ఓంకార శభ్దం" ఇంటిలో నరదృష్టి ప్రభావాల్ని తొలగిస్తుంది.
"
ఓంకార శభ్దం" ఇంటిలో అందరి మధ్య అన్యోన్యతలని,అప్యాయతలని కలిగిస్తుంది.
"
ఓంకార శభ్దం" షాపులో గాని ఆపీసులో గాని ఉపయోగించటం వలన ధనాభివృధ్ధి,జనాకర్షణ,గౌరవాలు,కీర్తిప్రతిష్టలు,కమ్యూనికేషన్,సహాయసహాకారాలు అందులో వున్న ప్రతి వ్యక్తికి కలుగుతాయి.
"
ఓంకార శభ్దం"వలన ముఖ్యంగా శివానుగ్రహాం కలుగుతుంది.   

                           మీ  రసూల్ యాన్ ఖాన్
 సెల్ నెంబర్ : 9866377553 








Wednesday, December 20, 2017

జన్మదిన శుభాకాంక్షలు వై ఎస్ జగన్ గారికి

జన్మదిన శుభాకాంక్షలు వై ఎస్ జగన్ గారికి


 

45వ వసంతంలోకి అడుగు పెడుతున్న వై ఎస్ జగన్ గారికి హార్దిక శుభాకాంక్షలు, తెలుపుతు ఈ 45వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని సంఖ్యా శాస్త్రం ద్వార వివరించడం జరుగుతుంది.

చివరి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త బాగుంటుంది అని చెప్పావచ్చు. వై ఎస్ జగన్ గారి జన్మసంఖ్యా (21-12-1972) అంటే 21(2+1=3)గురు సంఖ్యా )లో ఉన్నారు. ఆదే విధంగా విధి సంఖ్యా (2+1+1+2+1+9+7+2=25/7 )కేతు కావడం కాస్తా ఇబందిని గురు చేస్తుంది. రాశికి వచ్చే సరికి మీనా రాశి , మరల అధిపతి గురు కావడం, అంటే గురు యోక్క బలం చాల ఎక్కువ ఉండటం వల్ల, ధనానికి లోటు ఉండటం అనేది జరుగదు.

ఇక వై ఎస్ జగన్ విషయానికి వచ్చే సరికి కేతు ప్రభావం ఎక్కువగ చూపిస్తుంది, కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
2017 నుండి 2018 డిసెంబర్ వరకు కాస్తా చూసుకొని ఉండవలెను, యందుకు అనగా ఇమద్య సమయంలో అసిడెంట్, గాయాలు కలుగుటకు చాల ఆస్కారం ఉన్నది. కావున ప్రయాణం చేసేటపుడు కాస్త జాగ్రత్త  వాహిచడం చాల ఉత్తమమైనది.
 అందరు ఎదురు చూస్తూనట్టుగా 2019వ  సంవత్సరం, ఎన్నికలలో చాల గట్టి పోటి ఉంటుంది. మనశాంతి కోల్పోవలసి వస్తుంది. మెంటల్ డిప్రెషన్ లోకి వేలే అవకాశం ఎక్కువగా ఉన్నది. విజయానికి చాల దూరంలో ఉంటారు.
2019 ఎన్నికలలో కూడా మరోసారి చేదుఅనుభువం చవిచూడవలసి ఉంటుంది.
2014 ఎన్నికల గురుంచి కూడా ఎన్నికల ముందర చేపడం జరిగింది.



మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ................
మీ రసూల్ యాన్ ఖాన్
అస్ట్రో-న్యూమరాలజిస్ట్ ,జమోలోజిస్ట్ ,
సెల్:9866377553
  

CRYSTALS (పింక్ క్రిస్టల్స్ )

CRYSTALS
(పింక్ క్రిస్టల్స్ )

పింక్ క్రిస్టల్స్ 

మీ అమ్మాయికి, లేదా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరలేదా? అయితే మీ పిల్లల బెడ్‌రూమ్‌లో హృదయాకారంలో ఉన్న రెండు పింక్ క్రిస్టల్స్‌ ఉంచడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా ఉంచినట్లయితే, వారికి మంచి పెళ్లి సంబంధాలు రావడం, పెళ్లి కుదరడం జరుగుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.




అదేవిధంగా... క్రిస్టల్ గ్లోబ్‌ను పిల్లల టేబుల్ మీద ఈశాన్యంలో ఉంచడం ద్వారా మీ పిల్లల విద్యా, జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. క్రిస్టల్‌ గ్లోబును మీ టేబుల్ మీద ఈశాన్యంలో ఉంచి, ప్రతిరోజూ మూడుసార్లు ఆ గ్లోబును తిప్పినట్లైతే, మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.

ఇకపోతే.. నిజమైన క్రిస్టల్‌తో చేసిన ఓ వస్తువైనా అంటే... క్రిస్టల్ చెట్టు, క్రిస్టల్ పేపర్ వెయిట్, క్రిస్టల్ గ్లోబ్ వంటి వస్తువులను మీరు వాడే టేబుల్‌ ఎడమచేతివైపు ఉంచడం ద్వారా కెరీర్‌‌లో అభివృద్ధి చెందుతారని ఫెంగ్‌షుయ్ .

ఇదిలా ఉండగా.. భూమి నుంచి తీసిన రియల్ క్రిస్టల్ రాయిని వాస్తు దోషమున్న చోట పెట్టడం ద్వారా ఆ దోషము తొలగిపోవునని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

 రసూల్ యాన్ ఖాన్
సెల్ నెంబర్ : 9866377553 

Monday, December 18, 2017

LAKSHMI PYRAMID (లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్)





లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్:
 ఈ లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్ లోపల ఏవ్యక్తిదయిన బ్లాక్& వైట్ పోటో గాని, కలర్ పోటో గాని ఉంచి ఆవ్యక్తికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.ఇంకా గ్రహా భాదల నుండి తట్టుకొనే శక్తిని కల్పిస్తుంది .కనుదృష్టి ,నరదృష్టి మొదలయిన దృష్టి దోషాల నుండి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది.

లక్ష్మీ ఎనర్జీ బాక్స్ లోపల పెట్టిన టాబ్లెట్స్ వాటి యొక్క ( యం.జి) పెరుగుతుంది. దీనిలోపల పెట్టిన కూరగాయలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.క్యాష్ బాక్స్ గా వాడుకున్నచో థనానికి సంబందించిన సమస్యలు ఉండవు .కాపర్ యంత్రాలు ఈ బాక్స్ లో 45 రోజులు ఉంచిన ఆ యంత్రాలలో శక్తి ఉత్పాదన జరుగుతుంది .

లక్ష్మీ పిరమిడ్ బాక్స్ లో పెట్టిన భూములకు సంబందించిన విలువైన డాక్యుమెంట్లు గాని, ఇంటి డాక్యుమెంట్లు గాని,షాపు, ప్యాక్టరీకి సంబందించిన డాక్యుమెంట్లు ఎల్లప్పుడు ఈ బాక్సులో ఉంచితే భూములు అథిక దరలు పలకడమే కాకుండ,షాపు, ప్యాక్టరీకి సంబందించిన అభివృద్ది బాగుంటుంది.

ఇంకా ఈ పిరమిడ్ బాక్సులో స్టోన్ రింగ్స్,జపమాలలు, ప్యామిలీపోటోలు,లాకెట్స్ ,గోల్డ్ ఐటం మొదలగు వస్తువులేకాకుండా ఈ బాక్సులో పెట్టిన ఏ వస్తువుకైన రెట్టింపు శక్తిని ఇస్తుంది .

మీ  రసూల్ యాన్ ఖాన్
సెల్ నెంబర్ : 9866377553 



Sunday, December 17, 2017

గోరోచనం (GOROCHAN)

గోరోచనం 
(GOROCHAN)


ఒక ప్రసిద్ధమైన, అధ్బుతమైన పూజా ద్రవ్యం గోరోచనం. ఇది గోవు పిత్తమని కొందరు, గోవు శిరస్సు నుండి లభిస్తుందని మరికొందరు భావిస్తారు. 

అనేక సాధనా ప్రయోగాల్లో దీనిని వినియోగిస్తారు. ఇది అత్యంత శక్తివంతమైనది. పవిత్రమైనదిగా సాధకులు భావిస్తారు. ఈ కారణంగా ఇది కస్తూరి వంటి పూజా ద్రవ్యాల జాబితాలోకి చేరింది. దుర్లభమైన వస్తువు.


పూజాదికాలాల్లో, యంత్ర-తంత్ర కార్యాల్లో గోరోచనానికి ఉన్నత స్థానం లభించింది. దీని పొడితో అనేక పవిత్రమైన, శక్తివంతమైన యంత్రాలను రచిస్తారు. తాంత్రిక గ్రంధాల్లో దీనికి అనేక పేర్లున్నాయి. అన్ని వేళలా శుభాన్ని కలిగించే శివునిలా ప్రతిభావంతమైన గోరోచనాన్ని "శివా" అంటారు. మంగళకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది.

గోరోచనానికి మరొక పేరు "వందనీయ", కారణం - పూజ, అర్చనాదుల్లో ఆరాధ్యదైవానికి సమర్పించటమే. తిలకథారణకు, లేపనాలకు గోరోచనం శ్రేష్టమైనది. శ్రీకృష్ణ భగవానుడు అమిత ఇష్టంతో గోరోచనాన్ని తిలకంగా ధరించేవాడు.

మేధాశక్తిని వృద్ధి చేసే గుణ కారణంగా "మేధ" అని గోరోచనాన్ని పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు ఉండటంతో ముఖ్యమైన ఔషధంగానూ భావిస్తారు. గోరోచనం ఉన్న చోట దైవిక శక్తి నిలిచి ఉంటుంది.వాయుదోషాలు, అకాల మృత్యువు బారిన పడిన దీన దరిద్ర ప్రాణుల ఆత్మలు - ఇవన్నీ గోరోచన ప్రభావంతో దాని వాసన, రంగు స్పర్శ, దర్శనంతో దూరంగా పారిపోతాయి.

గోరోచనానికి దాని గుణం ఆధారంగా అనేక పేర్లున్నాయి. యంత్ర-తంత్ర సాధనాల్లో, యంత్రలేఖనంలో, వశీకరణ తిలక రచనలో షట్కర్మ, దశకర్మల అనేక ప్రయోగాల్లోనూ, అనేక ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు. దీనిని యంత్ర రచనకై అష్టగంధ్సిరాలో కూడా ఉపయోగిస్తారు.

ఏ అష్టగంథంలో గోరోచనం ఉపయోగిస్తారో, దానితో రాసిన యంత్రం శక్తివంతమైనదిగా ఉంటుంది. కాని, ఈ లాభం గోరోచనం శుద్ధమైనది, అసలైంది అయితేనే కలుగుతుంది. శుద్ధమైన గోరోచనాన్ని విధివిధాన యుక్తంగా ఉపయోగిస్తే ఉద్దేశాలు సఫలం కాకపోవటం అంటూ ఉండదు. శ్రద్ధ, సంయమనం, నియమం, ధైర్యం ఈ ప్రత్యేక సాధనకు అవసరం.

రవి పుష్య లేక గురుపుష్య యోగం రోజున శుద్ధమైన గోరోచనాన్ని తెచ్చి, ధూప దీపాలను సమర్పించి, ఇష్టదెవతా మంత్రంతో అభిమంత్రించి వెండి లేక బంగారు తాయెత్తులో నింపాలి. ఈ తాయెత్తును మెడ, భుజం లేక నడుముకు ధరించాలి. ధరించకపోయినా, దీనిని ఇంట్లో ఎక్కడైనా సురక్షితంగా ఉంచినా దీని ప్రభావం పనిచేస్తుంది. ఈ తాయెత్తు ఉన్న చోట అమంగళాలు, దుష్ప్రభావాలు నశిస్తాయి. మంగళ మయ వాతావరణానికి శుభఫలితాలనుప్రసాదించేటంత శక్తివంతమైనది.

ప్రతి వ్యక్తీ నవగ్రహాల ప్రభావంతొ పోషింపబడటం, పీడింపబడటం జరుగుతూ ఉంటుంది. శని, కుజ, సూర్య, రాహు, కేతువులను క్రూర, కఠోర, కష్టాలను కలిగించే గ్రహాలుగా భావిస్తారు. చంద్ర, బుధ, గురు, శుక్ర, గ్రహాలను సౌమ్య శుభప్రధమైన గ్రహాలుగా భావిస్తారు. కాని పరిశీలించి చూస్తే స్థితిని, సమయాన్ని అనుసరించి ప్రతి ఒక్క గ్రహం శుభాశుభ ఫలితాలను ప్రసాదిస్తాయని తెలుస్తుంది.

గోరోచనంలో నవగ్రహ దోష నివారణ శక్తి విహితమై ఉంది. ఇందువల్ల సాధకులు రవిపుష్య యోగంలో ఒక గ్రాము గోరోచనాన్ని గంగాజలంతో స్పృశింపజేసి, ధూపదీపాలను సమర్పించి, దానిలో ఒక భాగాన్ని వెండి తాయెత్తులో ఉంచి, రెండవ భాగాన్నికొత్త భరిణలో ఉంచి, స్నానం చేశాక మంచి నీటిలో కలిపి చందనంలా నుదుటిపై బొట్టుగా ధరించాలి. తాయెత్తును మెడలో లేదా భుజానికి ధరించాలి. ఇలా చేయటంవల్ల నవగ్రహం ప్రతికూలత నుండి విముక్తి లభిస్తుంది.

గురుపుష్య యోగం రోజున స్నానాదులు పూర్తి చెసి భోజపత్రంపై గోరోచన లేపనంతో ద్రాక్షఫలం ఉపయోగించి "హ్రీ" అని రాయాలి. దానికి ధూపాన్ని సమర్పించి, ఇష్టదైవాన్ని, శివుడిని లేదా దుర్గా దేవిని స్తుతిస్తూ భోజ పత్రాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి, వెండి లేదా రాగి తాయెత్తులో ఉంచాలి. దీనికి రోగికి ధరింపజేయాలి. దీర్ఘకాల అనారోగ్యాలనుండి విముక్తి కలుగుతుంది.