home

Tuesday, May 24, 2016

Astrology

రాగి నీటితో రోగాలు దూరం!
రాగి నీటితో రోగాలు దూరం!


పంచభూతాలు - గ్రహములు - రాశులు

సృష్టి లో ఉన్నప్రతీది పంచభూతాల సమ్మేళనమే.
పంచభూతాలైన భూమి , ఆకాశము ,అగ్ని, నీరు, వాయువు వీటి ప్రభావముచే సకల చరాచర జగత్తు ప్రేరిపితమగు చున్నది. విశ్వంలో జరిగే ప్రతి చర్య పంచభూతాల వలనే జరుగుచున్నది.నవగ్రహములు మరియు మేషాది ద్వాదశ రాశులు పంచ భూతముల అదీనములోనివే .

అది ఎలాననిన
నవగ్రహములలో రవి , కుజ గ్రహములు అగ్నితత్వము కలవి ..
చంద్ర , శుక్ర గ్రహములు జలతత్వము కలవి.
బుధుడు భూమి తత్వము కలవాడు
గురుడు ఆకాశ తత్వము కలిగినవాడు
శని వాయుతత్వము కలవాడు

అదే విధంగా మేష, సింహ , ధనుస్సు రాశులు అగ్నితత్వము
వృషభ, కన్యా , మకర రాసులు భూమి తత్వము
మిధున , తుల , కుంభ రాశులు వాయుతత్వము
కర్కాటక , వృశ్చిక , మీన రాశులు జలతత్వము కలవి.

 

పంచభూతములు - అవినాభావ సంబంధం

ఇంతకుముందు మనము పంచభూతాలు గురించి తెలుసుకొన్నాము. ఈ పంచభూతములన్నియు ఒకదానికి ఒకటి అవినాభావ సంభంధమున్నది. ఏలననగా
1.       అగ్ని జలం .  అగ్ని స్వరూపము అధికమగుట వలన నీరు ఆవిరిగా మారును
2.       జలం - వాయువు ఆవిరిగా మారిన జలము  వాయు రూపములో చేరును.
3.       వాయు ఆకాశము. వాయు రూపమునుండి ఆకాశ తత్వమునకు మారును
4.       ఆకాశము జలము . ఆకాశతత్వములో మేఘముగామారి తిరిగి జలతత్వమునకు మారుచున్నది.  
5.       జలము భూమి . జలతత్వముగా మారి తిరిగి భూమికి చేరుచున్నది. ఈ ప్రక్రియ జరుగుటకుమూలము అగ్ని దీనికి ఆధారభూతుడు సూర్యుడు . అందుచేతనే విశ్వం అనే రాజ్యమంతటిని పరిపాలించే సూర్యగ్రహమును రాజుగా అభివర్ణించినారు. .
6.       నీటి ప్రభావముచే అగ్ని ఆర్పివేయబడుచున్నది. బూడిదగా మారి భూతత్వములో కలియుచున్నది.
7.       అగ్ని స్వరూపము అధికమైనప్పుడు వాయువు తోడైతే అగ్ని ప్రళయమును సృష్టించును.
8.       అగ్నిస్వరూపము తక్కువైనప్పుడు అదే వాయువు అగ్నిని అర్పివేయును.
9.       ఈవిధంగా పంచభూతములన్నియు ఒకదానికొకటి అవినాభావ సంభందము కలిగి యున్నవి.       

నవగ్రహములు - ధాతువులు , Nine Planets - primitives

సృష్టిలో ఉన్న ప్రతివస్తువు ప్రతి పదార్ధము ధాతువుల సమ్మేళనమే . మానవుడు ఎంత అభివృద్ది సాధించినను ఈ సృష్టి నుంచే పొందుచున్నాడు. మహర్షులు మనకందించిన జ్యోతిష్య శాస్త్రము మరింత లోతుగా అధ్యయనము చేయుట ద్వారా మరింత పరిశోధన జరప గలిగితే మానవుని జీవనాభివృద్దికి అవసరమైన సలహాలు, సూచనలు అందించగలము.
లోహములు
రవికి రాగి,  చంద్రునకు మణులు, కుజునకు బంగారము , బుధునకు ఇత్తడి, కంచు . గురునకు వెండి
శుక్రునకు ముత్యములు , శనికి ఇనుము , సీసము
మానవుని శరీరంలో గ్రహముల అధిపత్యం
రవి ఎముకలు, చంద్రుడు రక్తము, కుజుడు ఎముకలలో ఉండు మజ్జ ,బుధుడు చర్మము , గురుడు మెదడు
శుక్రుడు రేతస్సు, శని నరముల పై ఆధిపత్యము వహించునని చెప్పియున్నారు.
అంతేకాక
శారీరక దృడత్వమును  - రవి వలన మానసిక స్తితిని చంద్రుని వలన శౌర్య, పరాక్రమములను- కుజుని వలన బుద్ధి సుక్ష్మతను బుధుని వలనను ఆలోచనా శక్తిని గురుని వలన  , శుక్రుని వలన సత్ప్రవర్తనను, శని వలన ఆయుస్సును మరియు బుద్ది మాంద్యతను తెలుసుకొన వచ్చును.

సౌరకుటుంబము

విశ్వం నంతటిని ఒక  రాజ్యముగా  ఉహించు కొం టే  సౌరకుటుంబము లో నవగ్రహములకు  సూర్యుడు రాజు చంద్రుడు రాణి బుధుడు యువరాజు శుక్రుడు మంత్రి కుజుడు సైన్యాధ్యక్షుడు గురుడు  ఆచార్యుడు శని సేనాధిపతి గా  మహర్షులు వర్ణించి యున్నారు .

sun is king, moon is queen , mercury is a prince, Venus is minister , Jupiter is professor , Mars is a Army Chief , and Saturn is imperator.  This is total Universe

అలాగే  ఒక  కుటుంబము గా  ఉహించుకొంటే రవి తండ్రి  చంద్రుడు తల్లి  కుజుడు  తోబుట్టువులు బుధుడు  మేనమామలను  శుక్రుడు జీవిత భాగస్వామిని గురుడు పుత్రులు {సంతానమును} శని  దాయాదులు మరియు సేవకులను  రాహువు మాతామహులను కేతువు పితామహులను సూచించును .

Example : The planets  family

sun is father, moon is mother, mars is  brothers and sisters , Mercury is an uncle, Venus is   Life partner, Jupiter is  son's& Daughters, Saturn is  Cousins and servants, rahuvu and ketu graha is  grandfathers  and grandmothers refers to them.

 


పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!

 


మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా. వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేధ్యం పెట్టేతాప్పుడు గమనించారా. ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనం చూస్తూ ఉంటాం.

మన పురాతన వైదిక సాంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్ధమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్ళల్లోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని. మనకే తెలియని శక్తి మన చేతి వేళ్ళలో దాగి ఉంది. బొటను వేలిలో అగ్ని, చూపుడు వేలిలో గాలి, మధ్య వేలిలో ఆకాశం, ఉంగరం వేలిలో భూమి, చిటికిన వేలిలో నీరు ఉంటాయట. మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మేడగు నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేశాం. పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి  కలిపిన అక్షింతలకు అంటి మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది.
 

అలా పంచభూతాలు మన అరచేతిలోనే  ఉండటం వల్ల  మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని పోతుంది. చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు. అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా. మన  శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకి ఆకర్షించబడి మనం స్పూన్స్ తో తినటం అలవాటు చేసుకుంటున్నాం. అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు.



అంతేకాదు మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. అలాగే మనం నిశితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది. అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చెయ్యాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు గాట్లు పెడతాం. ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి.
ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది. అందుకే హస్తసాముద్రికంలో మన చేతిలోని రేఖలని చూసి మన జాతకం చెపుతారు. ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది. అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే. ఇలా పంచాభూతలనే మన చేతిలో పెట్టిన దేముడికి ఎన్నిసార్లయినా చేతులెత్తి మొక్కచ్చు.




రాగి నీటితో రోగాలు దూరం!

 

రాగి లోహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ప్రకృతిలో స్వచ్ఛంగా దొరికే రాగిని వేల సంవత్సరాల నుంచి మన జీవితంలో వాడుతూనే ఉన్నాం. నాగరికత పెరిగిన దగ్గర్నుంచీ రాగి వాడకం కూడా పెరిగిందే కానీ తగ్గనేలేదు. విద్యుత్తుని ప్రసారం చేసేందుకు రాగికి ఉన్న ప్రత్యేకతను గమనించిన శాస్త్రవేత్తలు రాగితోనే మన జీవితాలలో వెలుగులు నింపారు. రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్‌తో రాగి ప్రతిచర్య జరుపుతుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ ప్రతిచర్య వల్ల నీటి గుణం సైతం మారిపోతుందన్నది మన పెద్దల నమ్మకం. దానికి అనుగుణంగానే రాగి పాత్రలో ఉంచిన నీటి రంగు, రుచి, వాసనలో తేడాని రావడం గమనించవచ్చు. పైగా రాగి మన శరీరానికి కావల్సిన ముఖ్య ధాతువు. అలా రాగి పాత్రలో నిలువ చేసిన నీటి ద్వారా మన శరీరానికి అవసరమ్యే ఖనిజం అందడమే కాకుండా, రాగి వల్ల ప్రభావితమైన నీటి వల్ల అనేక రకాల మేలు కలుగుతుందంటోంది ఆయుర్వేదం!

-
రాత్రిపూట రాగి పాత్రలో నీటిని ఉంచి పరగడుపున తాగమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఖాళీ కడుపుతో ఇలా తామ్రజలాన్ని సేవించడం వల్ల అందులోని ఔషధి గుణాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తామ్ర జలానికి త్రిదోషాలనూ (పిత్తం, వాతం, కఫం) పరిహరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ త్రిదోషాలూ కనుక సమతుల్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లే!

-
రాగి పాత్రలో కనుక నీటిని నిల్వ చేస్తే అందులోని హానికారక క్రిములు చనిపోతాయని అంటారు. మనకి వచ్చే వ్యాధులలో అధికశాతం నీటి ద్వారానే దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి... రాగి నీరు జాండీస్‌, డయేరియా వంటి వ్యాధుల బారినపడకుండా కాపాడే అవకాశం భేషుగ్గా ఉంది.

 -
జీర్ణ శక్తికి తోడ్పడటంలోనూ, శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలోనూ రాగి నీరు అత్యంత ప్రభావవంతమని ఆయుర్వేదం చెబుతోంది. ఎసిడిటీ, అల్సర్‌ వంటి జీర్ణ సంబంధ వ్యాధులలో కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుందట.

-
బరువు తగ్గాలనుకునేవారికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగమంటూ పెద్దలు సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ శక్తి ఎలాగూ చురుగ్గా ఉంటుందని తెలుసుకున్నాము. పైగా కొవ్వు కణాలను సైతం విడగొట్టే శక్తి రాగి నీటికి ఉందట.

-
రాగినీటి వల్ల మెలనిన్‌ ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలిసింది. దీని వల్ల మన చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుత్తు తెల్లబడే సమస్య ఉండదు. జుత్తు తెల్లబడడం మాట అటుంచి, రాగి నీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్యం మన దరి చేరదంటున్నారు.

-
రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో ఇనుముని శోషించుకునే గుణంలో కూడా మార్పు వస్తుందట. దీని వల్ల రక్త హీనత నుంచి తేలికగా బయటపడవచ్చు.

-
రాగినీటి ద్వారా మన శరీరానికి అందే ఫాస్పోలిపిడ్స్‌మెదుడు పనితీరుని మెరుగుపరుస్తాయి. మెదడులోని సమాచార వ్యవస్థకు, జ్ఞాపకశక్తికి ఇవి దోహదపడతాయి. మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయపడతాయి.

-
రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండెజబ్బుల విషయంలో రాగి గొప్ప ఫలితాన్నిస్తుందని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ సైతం తేల్చి చెప్పింది. గుండెపోటు, ఊబకాయం, చక్కెర వ్యాధులను తీవ్రతరం చేసే ట్రైగ్లిజరైడ్స్‌ అనే కొవ్వు పదార్ధాలను సైతం రాగి నీరు నియంత్రిస్తుందని తేలింది.

ఇలా చెప్పుకుంటూ పోతే రాగినీటితో ప్రయోజనాలు చాలానే కనిపిస్తాయి. కీళ్లనొప్పులు మొదల్కొని థైరాయిడ్‌ వరకూ ఎన్నో ఆరోగ్య సమస్యలలో రాగి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుందని సనాతన వైద్యం చెబుతోంది. అయితే రాగి పాత్రను శుభ్రంగా తోమకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అపరిశుభ్రమైన రాగి పాత్ర మీద పేరుకునే క్రియులు వాంతులు, విరేచనాలకు దారి తీయవచ్చు. అలాగే తాగమన్నారు కదా అని అవసరానికి మించి రాగి నీటిని పట్టించినా, మన శరీరంలో మోతాదుకి మించి రాగి పేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

ఇంటికి వాడే పెయింటింగ్స్‌లో నలుపురంగు వాడుతున్నారా?


మీ ఇంటికి కొత్తగా పెయింట్ వేస్తున్నారా? అయితే నలుపు రంగును ఎక్కడా వేయకుండా జాగ్రత్త వహించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. నలుపు రంగు నీటికి చిహ్నం అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా వాడకూడదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పైకప్పుల మీద, దూలాలకు ఈ రంగును పొరబాటున కూడా వాడకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇంకా నలుపు రంగును గృహానికి వేయించే పెయింట్‌లో ఎక్కడా వాడకుండా ఉండటమే మంచిది.

 

కానీ దూలాలకు, పైకప్పులకు తెలుపు రంగును వాడటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే గృహంలో పడమర దిక్కున తెలుపు రంగుతో కూడిన పోస్టర్లును తగిలిస్తే కుటుంబ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. 

 

ఇక ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను మీ గృహంలోని దక్షిణ, ఆగ్నేయ, ఈశాన్య దిశల్లో ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. రాబడికి ప్రతి రూపం ఎరుపు రంగు. అందువల్ల దక్షిణం వైపు ఎరుపు రంగు పోస్టర్లు, కర్టెన్‌లు, కార్పెట్‌లు వుంచితే లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. 

 

ఆగ్నేయం వైపు ఆకుపచ్చ రంగు సంపదకి ప్రతిరూపం. ఇదే రంగు తూర్పువైపు కూడా వేయిస్తే శుభఫలితాలుంటాయి. అందువల్ల రంగురంగుల పూల మొక్కల కుండీలను ఆగ్నేయ, తూర్పు దిశల్లో వుంచడం ద్వారా సంపద పెరుగుతుంది. ఇకపోతే.. నీలం రంగును ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు ఉంచడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ చేబుతుంది.

 

నేల మీద కూర్చుని తింటే!

ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...
- భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
- కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!
- చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.
- నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.
- తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.
- నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.
- See more at: http://www.teluguone.com/devotional/content/cross-legged-sitting-107-35673.html#sthash.eKrIcf0W.dpu

నేల మీద కూర్చుని తింటే!


·         ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...

·         - భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
·         - కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!

·         - చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.

·         - నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.

·         - తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.

·         - నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.


ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...
- భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
- కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!
- చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.
- నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.
- తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.
- నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.
- See more at: http://www.teluguone.com/devotional/content/cross-legged-sitting-107-35673.html#sthash.eKrIcf0W.dpuf
నేల మీద కూర్చుని తింటే!