మీ పిల్లలు.. మీ మాట వినడం లేదా? ఇవిగోండి టిప్స్!
చాలా మంది పిల్లలు మొండిగా
ప్రవర్తిస్తుంటారు. ఎలా చెప్పిన వినకుండా ఎదురు తిరుగుతుంటారు. చాలామందికి
ఎంతో డబ్బు ఉన్నా పిల్లలను అదుపులోకి తీసుకోలేక ఏం చేద్దామని
ఆలోచిస్తుంటారు. పిల్లలను ఆచరణలో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే
సరిపోతుందని ఫెంగ్‌షుయ్ అంటోంది. అవి ఏమిటో చూద్దామా...
ముందుగా మీ పిల్లలు నిద్రపోయే గది ఎదురుగా
మెట్లు, టాయిలెట్ ఉందేమో చూసుకోవాలి. అలాంటి వాటి నుంచి వెలువడే
ప్రతికూలశక్తుల ప్రభావం మీ పిల్లల్ని మొండి వారుగా తయారవవడానికి
కారణమవుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
కాగా... పిల్లల గది మెట్లకెదురుగా ఉంటే
వాటిని మార్చినట్లైతే మంచిఫలితం ఉంటుందని లేదా గదికి ఎదురుగా టాయిలెట్,
మెట్లకు మధ్యలో ఒక విండ్చైన్ వేలాడగట్టినట్లైతె మీ పిల్లల్లో మార్పులు
వస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
మీ పిల్లలను నేల మీద కాకుండా చాప, బెడ్‌మీద
పడుకోపెట్టినట్లైతే సరైన చి ప్రవాహ శక్తితో... సంతృప్తికి లోనవుతారని
ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. మీ అబ్బాయి, అమ్మాయి పడుకునే, చదువుకునే గదిలో
ఈశాన్యం వైపున ఒక చిన్న స్ఫటికాన్ని ఉంచినట్లైతే వారికి చదువులో
తెలివితేటలు పెరుగుతాయయీ.
ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను బెడ్ రూమ్‌లో పెడితే?
• ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు
• ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే పని చురుగ్గా నడుస్తుంది.
• ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ అదృష్టాన్నిస్తుంది.
• ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంట్లో ఉంటే పిల్లలు విద్యలో ముందుంటారు.
ఇంకా ఒకే ఒక్క ఫెంగ్ షుయ్ బొమ్మ కాదు.. జంటగా ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మను బెడ్ రూమ్‌లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది.
దంపతుల మధ్య ప్రేమబంధం పటిష్టంగా ఉంటుంది.
ఇంకా పడక గదిలో జంటగా వుండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తలు విబేధాలు
లేకుండా సుఖంగా జీవితం గడుపుతారు.
పడకగదిలో అద్దాలొద్దు.. ఏడ్చే యువతి, గుడ్లగూబ, డేగ పోస్టర్లు ఇంట్లో వద్దే వద్దు!
ఫెంగ్‌షుయ్ ప్రకారం పడకగదిలో అద్దాలను
ఉంచకూడదు. అలా ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వాటిని పడకగది
నుంచి తీసేయడం కుదరని పక్షంలో ఏదైనా వస్త్రంతో దానిని మూతవేయాలని
ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే పడకగదిలో డబుల్ కాట్లు ఉండకూడదు.
ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి. డబుల్ కాట్‌ను కలపడం చేయకూడదు. రెండు మంచాలను
కలిపి దానిపై పరుపు వేయడం మంచిది కాదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.
మరికొన్ని ఫెంగ్‌షుయ్ టిప్స్..
* టింక్లింగ్ బెల్స్ ఇంటి ముందు వేలాడదీయడం
ద్వారా నెగటివ్ ఎనర్జీ విచ్ఛీనమై.. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి
వచ్చినట్లవుతుంది. అందుకే రెండు మెటల్ బెల్స్‌ను ఇంటి ముందు ఉంచడం మంచిది.
* మందులను వంట గదిలో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
* మీ ఇంటి తలుపుల మీద స్వస్తిక్ ఇంకా ఓమ్ సింబల్స్‌ని ఉంచడం మంచిది.
* అయితే ఇంట్లో ఏడుస్తున్న యువతి, యుద్ద
సన్నివేశాల చిత్రం, కోపంగా ఉన్న మనిషి, గుడ్ల గూబ ఇంకా డేగ ఇలాంటి
పోస్టర్స్ ఉండకూడదట. వీటిలో ఏ ఒక్కటున్నా.. తీసేయడం మంచిది.
పడకగదిలో పుస్తకాలు పెట్టుకోవచ్చా?
పడకగదిలో పుస్తకాలకంటూ అలమరాను కేటాయించాం.
అయితే బెడ్ రూమ్‌లో పుస్తకాలు పెట్టుకోవడం మంచిది కాదని విన్నాం..
నిజమేనా...? కాదు. పుస్తకాలు పడకగదిలో ఉండటం ఫెంగ్ షుయ్ ప్రకారం చెడును
కలిగించదు. నిద్రించేందుకు ముందు కొంతసేపు పుస్తకాలను చదవడం మంచిదే.
ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు.. మహాత్ముల జీవిత గాథలను చదవొచ్చు.
అయితే నిద్రించేందుకు ఉపక్రమించేందుకు
ముందు పుస్తక అలమరాలను మూతపెట్టడం మంచిది. పుస్తకాలు పడకగదిలో మూతపెట్టే
షెల్ఫ్‌ల్లో ఉండటం ద్వారా మంచి శక్తినిస్తుందని ఫెంగ్ షుయ్ నిపుణులు
అంటున్నారు. పుస్తకాల చదవడం ద్వారా మాములుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని..
ఇంకా ఉన్నతమైన పుస్తకాలను నిద్రించేందుకు ముందు చదవడం ద్వారా మనలో
పాజిటివ్ శక్తులు పెరుగుతాయీ.
ఫెంగ్‌షూయ్ ప్రకారం ఫొటోల అమరిక!
మనకు ఇతరులతో ఉన్న ప్రేమ, స్నేహం,
ఆప్యాయతలకు చిహ్నంగా రకరకాల ఫొటోలను పెడుతుంటాం. అయితే ఫెంగ్‌షూయ్ ప్రకారం
ఎలాంటి ఫొటోలు ఏ ప్రాంతంలో, ఏ దిక్కులో పెట్టాలో ఎవరికీ అంత స్పష్టంగా
తెలీదు కదా. గృహాల నిర్మాణం, వస్తు అమరికల గురించి తెలుసుకున్నట్టే కుటుంబ
సభ్యుల ఫొటోల విషయంలో పాటించాల్సిన అంశాలను తెలుసుకుందాం...
గృహంలో పడమటి దిక్కున ఉన్న ప్రాంతాలు
పిల్లలకు మరియు సృజనాత్మకతలకు చిహ్నాలు. కాబట్టి ఆ ప్రాంతంలో పిల్లల
చిత్రాలను పెట్టండి. తద్వారా వారి శక్తిని పెంచినవారవుతారు. అలాగే కుటుంబ
సభ్యుల ఫోటోలను హాల్లో నైరుతి దిశలో మాత్రమే పెట్టడం ద్వారా మీ కుటుంబ
సభ్యులకు సుఖ, సంతోషాలను అందించిన వారవుతారు.
మీ ఇంటి యజమాని చిత్రాన్ని రెడ్ఫ్రేమ్తో
తయారు చేసి దక్షిణం వైపుగా ఉంచినట్టైతే, ఇంటి యజమాని పేరు, ప్రఖ్యాతులు
పెరుగుతాయి. అలాగే మీ బాస్, మీకు సాయం చేసే వారి ఫొటోలను నైరుతి దిక్కున
ఉంచితే వారి సహకారం ఎప్పుడూ అందుతూ ఉంటుంది. పొరపాటున కూడా దక్షిణం వైపు
ఎప్పుడూ నీలం రంగు ఫొటోలను పెట్టకండి.
అగ్నికి, నీటికి సంఘర్షణ జరుగుతుంది కనుక ఈ
దిశలో నీలం రంగు ఫొటోలను పెట్టడం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఈ దిశలో
ఫోనిక్స్ చిత్రాలను పెట్టడం ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆగ్నేయంలో
పచ్చిక బయళ్లతో కూడిన చిత్రాలను పెట్టడం ద్వారా సంపాదన పెరిగే అవకాశాలు
అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఆగ్నేయం సంపాదనకు ప్రతీక.
ఈశాన్య దిక్కులో వృక్షాలుంటే పురుషులకు హానికరమా?
సాధారణంగా ఇంటికి ఈశాన్య దిక్కులో
చాలామంది చిన్నపాటి చెట్లను, పూలకుండీలను పెంచుతుంటారు. అయితే భారీ
వృక్షాలు ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. ముఖ్యంగా ఈ
దిశలో వృక్షాలు ఉంటే ఇంటిలోని పురుషుల ఆరోగ్యానికి హానికరమని ఈ శాస్త్రం
చెపుతోంది. కానీ నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది.
కాబట్టి పై రెండు దిశల్లో వృక్షాలు మీ ఇంటి
బయటి స్థలానికి దగ్గరగా ఉన్నా ఫలితాలు పైవిధంగానే ఉన్నాయని ఫెంగ్‌షుయ్
నిపుణులు చెబుతున్నారు. దుష్ఫలితాలు కలిగించగల ఏ దిశలో చెట్టున్నా దాని
వైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మామూలు అద్దం పెట్టడం శ్రేయస్కరం.
కానీ మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదు అన్న
అనుమానం వద్దు. ఇంట్లో మొక్కలు పెంచడం ఇంట్లో దోషమున్న చోట ఆక్సిజన్
నింపడమే. దోషంలోని విషవాయువును లేదా కార్బన్-డై-ఆక్సైడ్ అవి
పీల్చుకుంటాయి. అలాగే ఒక దిశలో మొక్కలు పెంచితే ఆ దిశకు సంబంధించిన రంగు
బల్బు పెట్టడం మరిచిపోకూడదు.
ఇలా చేయడం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియకు
కావాల్సిన వెలుతురును బల్బు ద్వారా మనం ఇస్తున్నామన్న విషయాన్ని
మరిచిపోకూడదు. అందుకే కనీసం 21 రోజులయినా 24 గంటలూ బల్బులు వెలిగించి
ఉంచాలన్న నియమం పెట్టారని ఫెంగ్‌షుయ్ చేబుతుంది.